Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్పు మగవాడి నుంచే ప్రారంభమవ్వాలి: అత్యాచారాలపై నటి రమ్య

బెంగళూరులో చిన్నారిపై అత్యాచారం ఘటనపై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య తీవ్రంగా స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మగవాడిలో మార్పు రానిదే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్) చట్టంలో మార్పులు, ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు అవసరమని రమ్య అభిప్రాయపడ్డారు. మార్పు ముఖ్యంగా మగవాడి నుంచే మొదలవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పాఠశాలల యాజమాన్యాలు చిన్నారుల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. బెంగళూరులోని ఓ పాఠశాలలో స్కేటింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై అత్యాచారం చేయడం తెలిసిందే. పోలీసులు ఆ స్కేటింగ్ ఇన్ స్ట్రక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారిపై అత్యాచారం ఘటన పట్ల బెంగళూరు భగ్గుమంది. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

More Telugu News